అపార్ట్ మెంట్ లో ఆ వ్యక్తి అద్దెకి ఉంటున్నాడు. ఇక మరో ప్లాట్ లో ఇంకో మహిళ ఒంటరిగా ఉంటోంది. ఓ రోజు ఆమె ఫ్లాట్ లోకి వెళ్లి మూత్ర విసర్జన చేశాడు ఈ వ్యక్తి. బయటకు వస్తున్న క్రమంలో ఆమె ఒక్కసారిగా అతన్ని చూసి కేకలు వేసింది. చివరకు అతనిని పక్క ఇంటి వారు పట్టుకున్నారు. అందరి ముందు అతనికి వార్నింగ్ ఇచ్చింది.
దీంతో ఆ మహిళపై అతడు పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఫుల్ గా ఓరోజు మద్యం తాగి ఆమె ఫ్లాట్ లోకి ప్రవేశించి హత్యాయత్నం చేశాడు. వెంటనే అతని రాకని గమనించి ఆమె పెద్దగా కేకలు వేసుకుని బయటకు వచ్చింది. వెంటనే స్ధానికులు పక్కవారు రావడంతో ఆమె తప్పించుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో కోరడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కృష్ణ సోనెకర్ ఇలా తన ప్లాట్ లోకి వచ్చి మూత్రం పోశాడని, దీనిపై స్ధానికులు అందరూ అతన్ని తిట్టారని అక్కడ నుంచి తనపై పగ పెంచుకున్నాడని ఆమె తెలిపింది. అయితే ఆమె బయటకు పారిపోయిన తర్వాత, అతను పై నుంచి కిందకి దూకాడు. ఈ సమయంలో అతని కాలు విరిగింది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.