షాకింగ్- పులి కాదు పిల్లే..ఇద్దరిని చంపేసింది!

0
72

పిల్లి కూడా పులై ప్రాణాలు తీస్తుందంటే నమ్ముతారా. ఇది చదివితే కచ్చితంగా నమ్మక తప్పదు. పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాదకర ఘటన ఏపీలో చేసుకుంది. కృష్ణ జిల్లా వేములవాడ గ్రామానికి చెందిన కమల, నాగమణిని రెండు నెలల కింద ఓ పిల్లి కరిచింది. దీనితో వారు డాక్టర్ ను కలిసి టీటీ ఇంజక్షన్ వేయించుకొని మందులు వాడారు. దీనితో గాయంతో పాటు ఆరోగ్యం కూడా కుదుట‌ప‌డింది.

అయితే గ‌త నాలుగు రోజుల క్రితం క‌మ‌ల‌, నాగ‌మ‌ణిల‌కు మ‌ళ్లీ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దీంతో క‌మ‌ల మంగ‌ళ గిరిలో గ‌ల ఎన్ఆర్ఐ ఆస్ప‌త్రిలో చేరింది. నాగ‌మ‌ణి విజ‌య‌వాడ‌లో ఒక ప్రయివేటు ఆస్ప‌త్రిలో చేరింది. అయితే ఈ ఇద్ద‌రు కూడా శనివారం ఉద‌యం మృతి చెందారు.  కాగ పిల్లి క‌ర‌వ‌డంతో విరికీ ర్యాబిస్ వ్యాధి సోకిన‌ట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.  అయితే ఆ పిల్లి కూడా ఇటీవ‌ల కుక్క కాటుకు గురి అయి మ‌ర‌ణించింద‌ని గ్రామ‌స్తులు తెల‌పారు.