ఏడేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన సవతి తల్లి..కారణం ఇదే?

0
103

తెలంగాణాలో ఓ యువతి చేసిన పనికి పరిసరప్రాంతాల్లో స్థానికులు షాక్ అయ్యారు. కొడుకును చంపాలని నిర్ణయించుకున్న ఓ సవతి తల్లి మొదటగా తొలుత భవనంపై తోసేయడంతో అదృష్టవశాత్తు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రమాదమేమి లేదని సూచించారు. కానీ అయినా మారని సవతితల్లి కక్షతో రెండు వారాల తర్వాత గొంతు నులిమి చంపినా ఘటన హైదరాబాద్ నగరంలోని బర్కత్‌పుర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గోల్నాకలో నివసిస్తున్న భాస్కర్‌ ప్రైవేట్‌ ఉద్యోగికి ఉజ్వల్‌ అనే ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. ఉజ్వల్‌ సవతి తల్లి అయినా సరిత శనివారం భర్తకు ఫోన్‌ చేసి ఉజ్వల్‌ నిర్జీవంగా పడి ఉన్నాడని చెప్పడంతో ఆందోళనతో ఇంటికి వచ్చిన భాస్కర్‌ కుమారుడిని గమనించడంతో గొంతుపై కమిలిన చారలు కనిపించాయి. దాంతో అనుమాన పడ్డ భాస్కర్ కాచిగూడ పోలీసులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం అనంతరం అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాలుడిని గొంతు నులిమి హతమార్చినట్లు పోస్టుమార్టం లో తేలడంతో పోలీసులు సవతి తల్లి సరితను అడగగా అసలు నిజాన్ని ఒప్పుకుంది. మున్ముందు ఆమెకు పిల్లలు పుడితే భర్త వారిపై పూర్తి ప్రేమ చూపడనే  కారణంతో ఈ హత్యకు పాల్పడినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసారు.