జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
127

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా జనగామ జిల్లాలో  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ టవేరా వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

అంతేకాకుండా ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా..ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.  అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.