నంద్యాల జిల్లా(Nandyala District) అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక శాఖ పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. 12 మంది పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన పడవ లోపలికి నీరు రావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హుటాహుటిన 11 మందిని ఒడ్డుకు చేర్చారు. అయితే వీరిలో ఆశాబీ అనే మహిళ ఒడ్డుకు వచ్చిన తర్వాత మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మరణించింది. ఆదివారం కావడంతో అవుకు రిజర్వాయర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొందని.. ప్రయాణికులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
- Advertisement -
Read Also: జగన్ పనైపోయింది.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లిస్తా: లోకేశ్
Follow us on: Google News, Koo, Twitter