ఫ్లాష్: ఏపీలో విషాదం..పిడుగులు పడి నలుగురు మృతి

0
116

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాల్లో అకాల వర్షాలు, మెరుపులు, ఉరుముల కారణంగా ప్రజలు భయబ్రాంతులవుతున్నారు. అందరు భయపడిన విధంగానే పిడుకు కాటుకు నలుగురు ఒక్కేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదోని నియోజకవర్గంలోని కుప్పగల్ గ్రామంలో ఇద్దరు మహిళలు పొలాల్లో పనిచేస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరు ఆలూరు నియోజకవర్గంలోని వందవగిలి గ్రామ యువకులు మృతి చెందారు. దీంతో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఈ అకాల  వర్షాలు, పిడుగుల వల్ల ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోతారోనని జనం భయపడుతున్నారు.