భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, తర్వాత గంట మోగించి.. ఆ తర్వాత దేవుడిని దర్శించుకుంటారు. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందు నంది దగ్గరికి వెళ్లి నంది కొమ్ముల మధ్య లో నుండి శివుడి విగ్రహాన్ని చూడమని(Shiva Linga Darshan) అంటారు. అసలు ఎందుకు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడాలి దాని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం.
త్రిమూర్తుల్లో పరమేశ్వరుడు ఒకరు. ఆయనకి విగ్రహరూప ఉండదు. శివుణ్ణి లింగ రూపంలో మనం దర్శించుకోవాలి. శివుడు లయకారుడు. తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంతటి శక్తి ఉంది కాబట్టి శివుడిని డైరెక్ట్ గా మనం దర్శించుకోకూడదు. దర్శించుకుంటే అరిష్టం కలుగుతుందని అంటారు కాబట్టి ముందు శివుడికి ఎదురుగా ఉన్న నంది కొమ్ముల మధ్యలో నుండి శివుడు(Shiva Linga Darshan)ని చూడాలి. అంతేకాదు నంది చెవిలో కోరికలు చెప్తే ఆయన మన కోరికలు శివునికి చేరవేస్తాడని, ఆ కోరికలు నెరేరుతాయని విశ్వాసం.
Read Also:
1. హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat