గుడి(Temple)కి వెళ్ళినప్పుడు.. దైవ దర్శనమూ, షడగోప్యము అయ్యాక కాసేపు అక్కడే కూర్చోవాలి అని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలో చాలామందికి తెలియదు. స్వామి దర్శనం అయ్యాక దైవ సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనసుకి ప్రశాంతత కలగడంతో పాటు.. పుణ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదట. గుడిలో కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము, ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడుతాం. రోజు వారి జీవన విధానాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవటం ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా. కేవలం కూర్చోవటమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది.
Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Google News, Koo, Twitter