RGV: తినండి, తాగండి, సెక్స్ చేయండి.. విద్యార్థులకు వర్మ బోల్డ్ సజెషన్స్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ విద్యార్థులకు ఆయన ఇచ్చిన సలహాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిధిగా హాజరైన వర్మ.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సవాలక్ష ఆంక్షలు పెడతారు. ఇది మంచిది కాదు, అది చేయకూడదు అని చెబుతూ ఉంటారు. అవేమీ పట్టించుకోకండి. మీకు ఇష్టం వచ్చినట్లు జీవించండి అంటూ తన స్టైల్లో సలహా ఇచ్చారు.

- Advertisement -

ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పైకి రారు. నాలాంటి లాస్ట్ బెంచ్ స్టూడెంట్సే పైకి వస్తారన్నారు ఆర్జీవీ(RGV). హార్డ్ వర్క్ చేయకండి. స్మార్ట్ వర్క్ చేయండి అంటూ హితవు పలికారు. నచ్చింది తినండి, తాగండి, సెక్స్ చేయండి. ఒకవేళ చచ్చి పైకి పోయినా రంభ, ఊర్వశిలు ఉంటారు.. అక్కడా ఎంజాయ్ చేయవచ్చు అంటూ బోల్డ్ సజెషన్స్ ఇచ్చారు. వైరస్ వచ్చి సమాజంలో మగ జాతి అంతా పోవాలి. నేను ఒక్కడినే బతికి ఎంజాయ్ చేయాలనే కల ఉందంటూ చెప్పుకొచ్చారు. GST-2 ఎప్పుడు అని విద్యార్థులు అడగ్గా.. మీ దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయిగా మీరే తీసుకోవచ్చంటూ సెలవిచ్చారు రామ్ గోపాల్ వర్మ.

Read Also: మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు నోటీసులు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...