దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం లాభాలు రావడంతో రెండు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 62,547.11 మవద్ద స్థిరపడగా.. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద ముగిసింది. టాటా స్టీల్, మారుతీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా షేర్లు లాభపడగా.. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.