ఒక్క ఇంజెక్షన్‌తో ఎయిడ్స్ ఇక ఖతం..అందుబాటులోకి అప్పుడే?

AIDS can be cured with a single injection.

0
50

దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తుంది హెచ్ఐవి. దీనికి ఇప్పటివరకు మందు లేకపోగా నివారణ ఒక్కటే దిక్కైంది. ఎయిడ్స్‌కు కారణమయ్యే ఈ వైరస్‌ ముందు ఎవరైనా తల వంచాల్సిందే. కానీ ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. ఎయిడ్స్‌పై పోరాటానికి వారికి అస్త్రం దొరికేసింది.

ఈ వ్యాధికి కారణమయ్యే వైరస్‌ను సమూలంగా ఖతం చేసే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఒక్కడోసు ఇవ్వడం ద్వారా… హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్‌ నుంచి బాధితులకు విముక్తి ప్రసాదించే అవకాశముందని వారు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్‌ పరిశోధనల్లో భారీ ముందడుగుగా శాస్త్రవేత్తలు దీన్ని పేర్కొంటున్నారు.

ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు కూడా ఇవే! బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి. అయితే దీనిపై మరికొన్ని లోతైన పరిశోధనలు, వ్యక్తులపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఇంజక్షన్ అందుబాటులోకి రావాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.