రాజ్​భవన్ వద్ద రణరంగం..ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి

0
47

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించడాన్ని కాంగ్రెస్​ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

నిరసనల్లో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ నేతలు, కార్యకర్తలు గురువారం ఉదయం రాజ్‌భవన్‌ను ముట్టడించారు. అకస్మాత్తుగా రాజ్‌భవన్ ఎదుటకు చేరుకున్న వారు ప్రధాన గేటు వద్ద బైఠాయించి కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి.

ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ నేతలపై పోలీసులు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.