Breaking: బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ నియామకం..వెనక్కి తగ్గని విద్యార్థులు

0
109

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వత వీసీ నియామకం జరగలేదు. దీనికి తోడు మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, యూనిఫాం డ్రెస్సుల పంపిణీ చేయడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని.. విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ సతీశ్ కుమార్ ను ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావంటున్నారు విద్యార్థులు. సీఎం వస్తే తప్ప ఆందోళన విరమించమని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం అని భైంసా ఏఎస్పీ తెలిపారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపామనడం అవాస్తవం. భైంసా ఏఎస్పీ విద్యార్థులకు ఆహారం, నీళ్లు అందుతున్నాయని ఏఎస్పీ తెలిపారు.