అలర్ట్ — ఈ అనారోగ్య సమస్యలు ఉంటే కోవాక్సిన్ తీసుకోకండి .. భారత్ బయోటెక్ ప్రకటన

-

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఈనెల 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సిన్ అందిస్తున్నారు.
భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవాక్సిన్ .భారత్ బయోటెక్ కు సంబంధించిన కోవాక్సిన్ టీకాని చాలా మందికి ఇచ్చారు, అయితే కొందరికి టీకా తీసుకున్న తర్వాత ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

- Advertisement -

దీంతో తాజాగా భారత్ బయోటెక్ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది. ఎవరైనా రోగనిరోధక శక్తికి సంబంధించి మందులు వాడుతుంటే ఈ టీకా తీసుకోవద్దు …రోగనిరోధక శక్తి లేనివారు లేదా వారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు,
కోవాక్సిన్ తీసుకోకూడదని భారత్ బయోటిక్ తెలిపింది..

మీకు ఏదైనా అలర్జీ అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే టీకా తీసుకునే ముందు వైద్యులకి తెలియచేయండి అని తెలిపింది. మీ సమస్య బట్టీ వారు మీకు టీకా ఇవ్వాలా వద్దా అనేది చూస్తారు…అలెర్జీ చరిత్ర ఉన్నవారు టీకా తీసుకోవద్దు
జ్వరం ఉన్నవారు, రక్తస్రావం ఉన్నవారు , అలాగే రోగనిరోధక శక్తి లేనివారు ,గర్భవతులు, మరొక కోవిడ్-19 వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్న వారు వీటికి దూరంగా ఉండాలి. ఇక చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం గొంతు వాపు, వేగంగా హృదయ స్పందన, శరీరమంతా దద్దుర్లు, మైకం రావడం అనేది కనిపిస్తోంది, ఇలా ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించాలి అని సీనియర్ వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...