ఓట్స్ తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదులుకోరు

Benefits of eating oats

0
57

ఈరోజుల్లో రోగాల గురించి ప్రతీ ఒక్కరు భయపడుతున్నారు. అందుకే ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడో వారానికి ఓ పండు తినేవారు కూడా, ప్రతీ రోజు జంక్ ఫుడ్స్ మానేసి ఈ పండ్లు, తాజా కూరలు తింటున్నారు. అయితే ఇటీవల మైదా, గోధుమ పిండికి బదులుగా ఓట్మీల్ బ్రెడ్,ఓట్స్ ఉపయోగిస్తున్నారు.

ఈ రోజుల్లో ఓట్స్ చాలా మంది తింటున్నారు. షుగర్ పేషెంట్స్ అయితే వందలో 50 శాతం మంది ఓట్స్ ని లైక్ చేస్తున్నారు.ఒక 100 గ్రాముల ఓట్స్లో కేలరీలు 389, ప్రోటీన్ 16.9 గ్రా, చక్కెర 0 గ్రా, ఫైబర్ 10.6 గ్రా ఉంటాయి, సో షుగర్ ఉన్న వారు హ్యీపీగా దీనిని తీసుకోవచ్చు. అంతేకాదు చాలా మంది గ్లూటెన్ గురించి భయపడతారు. ఇది గోధుమలో ఎక్కువగా వస్తుంది అందుకే గోధుమ కంటే ఓట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు.

షుగర్ వారికి ఓట్స్ ఎలా బెస్ట్ అంటే. ఓట్స్ మీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఓట్స్లో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, డైటరీ ఫైబర్ ఉంటాయి, ఇక మలబద్దక సమస్య ఉండదు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.