వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల ఈ సమస్యలకు చెక్..

0
108

భానుడి విశ్వరూపంతో ప్రజలు ఎండలకు అతలాకుతలం అవుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లటి పానీయాలు, చల్లటి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వాటికీ బదులుగా పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలగకపోవడమే కాకుండా..శరీరానికి కూడా మేలు చేకూరుతుంది. అవేంటో మీరు కూడా చూడండి..

పుచ్చకాయ రోజు తీసుకోవడం వల్ల విటమిన్ 17 శాతం లభించడంతో పాటు విటమిన్ సి  21 కూడా లభిస్తుంది. దీని వల్ల మనకు తక్షణ శక్తి చేకూరుతుంది. పుచ్చకాయలో నీటి శాతం మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. దీనికరణంగా జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే దూరమయిపోతాయి. దాంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ తినడం వల్ల వేసవిలో సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు మన మీద పడిన కూడా ఎక్కువగా ప్రభావం చూపవు. అంతేకాకుండా శరీర వేడిని విడుదల చేయడానికి ఉపయోగవపడుతుంది. పుచ్చకాయ రసంలో విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయ రసం పగటి పుట తాగడం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి.