దేశంలో స్థిరంగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
39
భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో..5,383 కేసులు నమోదు అయ్యాయి.

 

దేశంలో కరోనా పాజిటివిటి రేటు 0.10 శాతంగా ఉంది. ఇక కరోనా వ్యాక్సిన్ల విషయానికొస్తే దేశ వ్యాప్తంగా 217.26 కోట్ల మంది టీకాలు వేసుకున్నారు. కానీ కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తం కేసులు: 4,45,58,425

మరణాలు: 5,28,449

యాక్టివ్ కేసులు: 45,281

రికవరీలు: 4,39,84,695