మెంతికూర తింటే కలిగే లాభాలు తెలిస్తే కచ్చితంగా వదిలిపెట్టరు

Definitely do not give up if you know the benefits of eating fenugreek leaf's

0
98

ఆకుకూరల్లో ప్రతీకూర శరీరానికి మంచి చేస్తుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, బచ్చలి, కరివేపాకు, కొత్తిమీర,పుదీనా, మెంతికూర, పాలకూర, చుక్కకూర ఇలా అన్నీ కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. అయితే వీటిని బాగా కడిగి అప్పుడు కూరలు చేసుకోవాలి. నిపుణులు ఓ ఆకుకూర గురించి చెబుతున్నారు. తరచూ అది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలని.

ఆకుకూరల్లో మెంతికూర గురించి చెబుతున్నారు వైద్యులు. అయితే చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. చేదు అని పెద్ద తినలేము అని అనుకుంటారు. కాని అనేక పోషకాలతో ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూర ఎక్కువగా షుగర్ పేషెంట్లని కూడా తీసుకోమంటారు. అంతేకాదు షుగర్ సమస్య రాకుండా ఉండాలన్నా మెంతి కూర చాలా మేలు చేస్తుంది.

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, అధిక బరువు, ఊబకాయ సమస్యలు ఉన్నా మెంతికూర చక్కటి పరిష్కారం. ఇక ఐరన్ లోపంతో చాలా మంది ఉంటారు అలాంటి వారు వారానికి రెండు సార్లు మెంతికూర తింటే ఎంతో మేలు . ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . ఇక కొందరు మెంతికూర జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు