రోజూ బాదం తింటున్నారా? మోతాదు మించితే ఏమవుతుందో తెలుసా?

Do you eat almonds every day? Do you know what happens if the dose is exceeded?

0
113

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి మంచి ఆహారాల్లో నట్స్, సీడ్స్ ప్రధమ స్థానంలో ఉంటాయనే చెప్పుకోవాలి.

నట్స్‌లో ఎక్కువ మంది బాదం పప్పులు తినేందుకే ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా చెప్పుకునే బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి మాంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత శాఖహార ట్రెండ్‌లో చాలామంది బాదం పాలు, బాదం బటర్ తదితర వెరైటీలను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. మరి, బాదం పప్పులు ఎంతవరకు మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి? ఎక్కువ మోతాదులో బాదం తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బాదం పప్పును తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బాదం పప్పులో విటమిన్- ఇ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, ఇవి శరీరంతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు  బాదంపప్పును తరచుగా తినేలా చేస్తుంటారు. బాదంపప్పుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని మితంగానే తీసుకోవాలంటారు నిపుణులు. లేకపోతే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

బాదంపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి.  వీటిని అధికంగా తీసుకోవడం  వల్ల శరీరంలో కొవ్వుల శాతం పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.  బరువు తగ్గాలనుకునే వారు కనీస స్థాయిలో బాదంపప్పును తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బాదంపప్పును రోజూ తీసుకోవడం మంచిది, కానీ  మోతాదుకు మించి తింటే, శరీరంలో విషతుల్య పదార్థాల స్థాయులు  పెరిగే ప్రమాదం ఉంది. ఇది శ్వాసకోశ సమస్యలపైనా, నాడీ వ్యవస్థపైనా  ప్రతికూల ప్రభావం చూపుతుంది. పగటిపూట 4 నుంచి 5 బాదంపప్పులు మాత్రమే తినాలని,  అది కూడా నానబెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.