వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటున్నారా? అయితే ప్రమాదం పొంచి వున్నట్టే..

0
119

చాలా మంది వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా తినేవారికి ప్రమాదం పొంచివున్నట్టే అంటున్నారు నిపుణులు. ఇలా తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వేడి అన్నంలో ఏ ఏ ఆహార పదార్థాలు వేసుకొని తినకూడదో ఇప్పుడు చూద్దాం..

వేడి అన్నంలో పెరుగు కలిపి తింటే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉండడంతో పాటు..అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే  పెరుగు అన్నం ఎప్పుడూ చల్లగానే తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. వేడి అన్నంలో పెరుగు మాత్రమే కాకుండా..మజ్జిగ కూడా కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో ఉల్లిపాయలను సైతం కలుపుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంకా పెరుగులో మామిడి పండు కలుపుకుని తినడం కూడా హానికరం. అంతేకాకుండా వేడి అన్నంలో బాగా చల్లని పదార్థాలను కలపడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.