పసిపిల్లలకు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?

0
39

సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. అయితే ఒక్కోసారి చిన్న పిల్లల్లో వచ్చే ఎక్కిళ్ళు తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేస్తాయి. అయితే చిన్నపిల్లల్లో ఇవి సహజంగా వస్తుంటాయి. అందుకు ఆందోళన పడవల్సిన అవసరం లేదు. అందుకు కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. పసిపిల్లల్లో ఎక్కిళ్ళకు మొదట కారణాలు తెసుకొన్నట్లైతే ఎక్కిళ్ళను పోగొట్టడానికి అతి సులభమైన మార్గాలున్నాయి.

ఎక్కిళ్లు రావడానికి కారణం ఏంటంటే..

డయాఫ్రమ్ ..ఇది సన్నని అస్థిపంజర కండరం, ఛాతీ భాగంలో ఉండే ఈ కండరం, ఛాతీని, పొట్టను వేరు చేస్తుంది.. ఈ డయాఫ్రమ్ సంకోచం, స్వరతంత్రులు మూసుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయని అంటున్నారు నిపుణులు. తద్వారా గొంతులోంచి ఒక రకమైన శబ్దం వినిపించడం మనకు తెలిసిందే. ఇలా ఎక్కిళ్లు వస్తున్నప్పుడు బేబీ అసౌకర్యాన్ని దూరం చేయాలంటే కొన్ని చిట్కాల్ని పాటించాలి.

ప్యాసిఫయర్‌తో…

కేవలం.. పాలు తాగే క్రమంలో పొట్టలోకి వెళ్లే గ్యాస్ కారణంగా చిన్నారులందరిలో ఎక్కిళ్లురావు.., కొంతమంది పిల్లల్లో ఎక్కువగా నవ్వడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. అయితే ఇలాంటప్పుడు వారి నోట్లో ప్యాసిఫయర్(తేనెపీక) పెట్టడం వల్ల డయాఫ్రమ్ రిలాక్సయి తద్వారా నెమ్మదిగా ఎక్కిళ్లు తగ్గే అవకాశముందట.

నిజానికి చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. లేదా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.

కొన్ని సార్లు బిడ్డకు పాలు పట్టేటప్పుడు, పాలతో పాటు గాలిని కూడా మింగుతారు. ఇది పిల్లల్లో ఎక్కిళ్ళ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి, మీరు బిట్టకు పాలు పట్టేటప్పుడు తగు మరిమాణంలో అందించాలి. మరియు కూర్చోబెట్టుకొనే లేదా పడుకోబెట్టుకొనే పొజీషన్ సరిగా ఉందో లేదో చూసుకొని పాలు పట్టించాలి.

ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే కొందరు పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలుంటే కూడా ఎక్కిళ్లు వస్తాయి. కాబట్టి వాటంతటవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయకుండా పదే పదే ఎక్కిళ్లు వచ్చినా, ఎక్కువ సేపు తగ్గకుండా చిన్నారుల్ని ఇబ్బంది పెట్టినా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.