వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ జాగ్రత్త పెట్టాలి ముఖ్యంగా వేసవిలో రాగి పాత్రలను వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకో మీరు కూడా చూడండి..
రాగిపాత్రల వాడకం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వేసవిలో వాడడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాగి పాత్రల్లో వంట చేయడం వల్ల కాపర్ వంటలోకి చేరుతుంది. దీనివల్ల రక్తస్రావం, ఆకలి వేయకపోవడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి నుండి అధికంగా పెరగడం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా రాగిపాత్రల్లో నిల్వ చేసిన వంటకాలను పిల్లలకు పెట్టడం వల్ల చాలా దుష్ఫలితాలు ఎదురవుతాయి. వేసవిలో వీటిని వాడడం వల్ల వేడి అధికంగా పెరిగి పిల్లలు రోజు అంతా చురుకుగా ఉండకపోవడమే కాకుండా కళ్లు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో రాగిపాత్రల్లో పాలు, పుల్లని పదార్థాలను నిల్వ ఉంచకూడదు.