బిర్యానితో పోటీ పడుతున్న దోశ..అత్యంత జనాదరణ పొందిన ఫుడ్ ఏదంటే?

Dosha competing with Biryani..which is the most popular food?

0
34

బిర్యానీతో పోటీ పడింది దోశ. అవును మీరు చదివింది నిజమే. బిర్యానీతో దోశ పోటీ పడడం ఏంటి అని ఆలోచిస్తున్నారా. అక్కడికే వస్తున్న. ప్రస్తుత రోజుల్లో బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు . ఫ్రెండ్స్ కలిసిన, ఫ్యామిలీతో బయటకు వెళ్లినా బిర్యాని లాగించాల్సిందే. అందుకే బిర్యాని అత్యధిక ప్రజాధారణ పొందిన ఫుడ్ గా చెప్పుకోవచ్చు.

దేశంలో ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ట్రెండ్ గా మారింది. క్షణాల్లో కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా జొమాటో, స్విగ్గి సేవలు ఊపందుకున్నాయి. వారు ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఆహార పదార్ధాలు ఏంటో ఒక అంచనాకు రావచ్చు.

స్విగ్గి, జొమాటో ఆర్డర్లను బట్టి చూస్తే మన దేశంలో అత్యంత జనాదరణ పొందిన ఫుడ్ బిర్యాని అని తెలుస్తుంది. దేశంలో జొమాటో ద్వారా ప్రతి సెకన్ కు ఒక బిర్యాని ఆర్డర్ చేసుకుంటున్నారు. స్విగ్గి ద్వారా ప్రతి సెకన్ కు 2 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయి. ఇక రెండో స్థానంలో దోశ ఉంది. 85 లక్షల దోశ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గి, జొమాటో నివేదికలు చెబుతున్నాయి. బిర్యానితో సమానంగా దోశను ఇష్టపడడం గమనార్హం.

ఇక ఆ తరువాత పన్నీర్ బట్టర్ మసాలా, బట్టర్ నాన్ వున్నాయి. అలాగే స్నాక్స్ విషయానికి వస్తే వడా పావ్, సమోసా ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి. ఈ ఏడాదిలో న్యూజీలాండ్ జనాభాతో సమానంగా సమోసాలు అమ్ముడుపోయాయి. ఇక స్వీట్ల విషయానికి వస్తే మొదటి స్థానంలో గులాబ్ జామ్ ఉండగా రెండో స్థానంలో రస్మలై ఉంది. భారతీయులు ఏ ఆహరం ఎక్కువ ఇష్టపడుతున్నారో ఈ నివేదికల వల్ల తెలుస్తుంది.