మొహంపై మొటిమలతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

Suffering from acne on the face? But follow these tips.

0
41

ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. అవి పోవడానికి నానా తంటాలు పడుతుంటారు. శఅయితే..మొహంతో పాటు శరీర మొటిమలను పలు చిట్కాల సహాయంతో నయచేయవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శరీరంలో మొటిమల సమస్య ఉంటే..స్నానం చేయడానికి చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. అయితే శీతాకాలంలో మీరు స్నానానికి కొద్దిగా వెచ్చని నీటిని ఉపయోగించాలి.  ముఖం వంటి శరీర మొటిమలను తొలగించడానికి మస్సాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి బాడీ స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 చలి వాతావరణంలో మీరు శరీరంలో మొటిమల వల్ల ఇబ్బంది పడుతుంటే కొన్ని పద్దతులను పాటించాలి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. వదులుగా ఉండే బట్టలు ధరిస్తే కంఫర్ట్ గా ఉంటుంది. శరీరంలో ఏర్పడే మొటిమలను తొలగించడంలో వేప పేస్ట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి దానిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం దానికి శరీరంపై మొటిమల మీద పూయాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.