ప్లాస్టిక్ బాటిళ్లల్లో నీళ్లు తాగుతున్నారా? అయితే మీకు ప్రమాదం పొంచివున్నట్టే..

0
90

వేసవిలో భానుడు ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి అందరు నీటిని అధికంగా తాగుతుంటారు. చాలామంది దుకాణాల్లో దొరికే ప్లాస్టిక్ బాటిళ్లు కొనుక్కొని నీటిని తాగుతుంటారు. మరికొంతమంది  క్యాన్ల‌లో నీటిని ఇంటికి తెచ్చుకొని తాగుతుంటారు. కానీ వాటిలో నీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బయట మార్కెట్లో బాటిళ్లల్లో నీటిని అమ్మేవారు వాటిని ఎక్కువసేపు ఎండలో ఉంచుతారు. దానివల్ల కొన్ని రసాయనాలు వెలువడుతాయి. బాటిళ్లల్లో నీటిని అధికంగా తాగేవారు రొమ్ము క్యాన్స‌ర్ భారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మ‌ధుమేహం, ఊబ‌కాయం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

ఇంకా రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లో దొరికే బాటిళ్లను కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు ఎండలో ఉంచిన బాటిళ్లను కొనడం కంటే..నీడ‌లో ఉండే బాటిళ్లను కొనడం మంచిది. అంతేకాకుండా బాటిళ్లల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిని కూడా తాగకూడదు.