తలనొప్పిని చిటికలో మాయం చేసే చిట్కాలివే?

0
36

ప్రస్తుత కాలంలో ఒత్తిడి, పనిభారం కారణంగా తలనొప్పి బారిన పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఈ తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది వివిధ రకాల చిట్కాలతో పాటు..మార్కెట్లో దొరికే ట్యాబ్లెట్లను కూడా వాడుతుంటారు. అయినా ఆశించిన మేరకు ఫలితాలు మాత్రం లభించవు. అందుకే సాధారణంగా మన అందరి ఇళ్లల్లో దొరికే పదార్దాలతో మన తలనొప్పిని చిటికలో మాయం చేసుకోవచ్చు.

తలనొప్పిని తగ్గించడంలో గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు  అధికంగా ఉండడం వల్ల కేవలం తలనొప్పే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. నిమ్మరసం తో గ్రీన్ టీని కలిపి తాగితే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంకా  రోజుకు రెండుసార్లు ద్రాక్షపండ్ల జ్యూస్ చేసి తాగిన కూడా తలనొప్పి తగ్గుతుంది.

ఇంకా అల్లం రసంలో కాస్త నిమ్మరసం గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. తలనొప్పి మరింత వేధిస్తున్నప్పుడు గంధంతో నుదుటి మీద పట్టీలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగిన కూడా తగ్గుతుంది.