గంజిని పారబోస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే ఇకపై వేస్ట్‌ చేయ‌రు..!

0
104

గంజిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బియ్యంను కడిగి వండినప్పుడు దానిలోని పోషకాలన్నీ గంజిలో ఇమిడిపోయి.. దాన్ని తీసుకున్నప్పుడు ఆ పోషకాలు మనకు అందుతాయి. దీనివల్ల మనం ఏ  సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తాము. కానీ గంజితో లాభాలు బోలెడు ఉన్నాయన్న విషయం తెలియక చాలా మంది దాన్ని వేస్ట్‌ చేస్తున్నారు.

గంజిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కావున ప‌సిపిల్లలు పాలు స‌రిగ్గా తాగ‌క‌పోతే వారికి క‌నీసం గంజి నీటిని అయినా తాగించాలి. దాంతో వారికి కావల్సిన ఆహారం అంది శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌ణ స‌రిగ్గా ఉండి పిల్లలు ఆరోగ్యకరంగా జీవిస్తారు. విరేచ‌నాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంట‌నే విరేచ‌నాలు త‌గ్గుతాయి.

ఇంకా చ‌ర్మంపై దురద వ‌స్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మ‌ర్దనా చేయాలి. దీంతో దుర‌ద‌లు త‌గ్గిపోతాయి. గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడటం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.