రోజుకు ఇన్ని ఉల్లిపాయలు తింటే గుండెపోటు రాదట..!

0
93

సాధారణంగా మహిళలు ఉల్లిని అన్ని రకాల వంటల్లో వేస్తుంటారు. ఎందుకంటే ఉల్లిని వంటల్లో వేయడం వల్ల రుచి పెరగడంతో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ కొంతమంది ఉల్లిని తినడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారీకి ఒక్కసారి ఈ లాభాలు తెలిస్తే రోజు ఉల్లిని తిన్నాడని ఇష్టపడతారు.

అవేంటంటే..ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకలలో  ధృడంగా ఉండేలా చేయడంతో పాటు..గుండెకు సంబంధించిన వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా తెల్ల ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉల్లి గుజ్జు ముఖానికి పట్టించటం వలన మొటిమలు, మచ్చలు కూడా ఇట్టే తొలగిపోతాయి.

ముఖ్యంగా గుండెపోటును నియంత్రణలో ఉంచడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. రోజుకు 100గ్రాముల పరిమాణంలో ఉన్న పచ్చి ఉల్లిపాయ తింటే అధిక కొవ్వు నియంత్రణలో ఉంచడంతో పాటు..గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఎర్ర ఉల్లికంటే తెల్లగా ఉండే  ఉల్లిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. కావున తెల్ల ఉల్లిని తినడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.