గుడ్డులో పచ్చసొన తినచ్చా – తినకూడదా?

గుడ్డులో పచ్చసొన తినచ్చా - తినకూడదా?

0
37

గుడ్డు రోజూ ఒకటి తింటే చాలు, చాలా మంచిది అని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు, గుడ్డులో ఉంటే పోషకాలు శరీరానికి మంచిది, అయితే చాలా మంది పచ్చిగుడ్డు తీసుకుంటారు, కొందరు ఉడకబెట్టి తీసుకుంటారు, మరికొందరు పచ్చసొన తినకుండా వైట్ తెల్లసొన తింటారు, ఇలా వారి అభిరుచి బట్టీ గుడ్డు ఆహరంగా తీసుకుంటారు.

ఇక జిమ్ కు వెళ్లేవారు అసలు పచ్చసొన జోలికి వెళ్లరు, ఇక డైట్ ఫాలో అయ్యే వారు పచ్చ సొన తినరు,
అది తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందులో కొలెస్ట్రాల్ ఉండడమే అలా అనుకోవడానికి కారణం.. అయితే ఇది తింటే కొందరికి మాత్రమే అధిక కొవ్వు వస్తుంది అని అంటున్నారు.

ఇలా అందరికి కొవ్వు పెరుగుతోంది అని అధ్యయనాల్లో చెప్పడం లేదు.. గుడ్డులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఒక గుడ్డు రోజూ తింటూ ఉంటే పిల్లలకు కూడా చాలా మంచిది. ఎదుగుదల ఉంటుంది, కొవ్వు సమస్య గురించి ఎదిగే పిల్లల పై ఆలోచన వద్దు, ఇక రోజూ ఓ గుడ్డు తింటే పక్షవాతం సమస్యలు రావట, నిక్షేపంగా గుడ్డు తినవచ్చు.