సామాన్యులకు గుడ్ న్యూస్- భారీగా తగ్గిన ధరలు

0
93

ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వంట నూనె ధరలు మొన్నటి వరకు ఆకాశాన్నంటాయి. దీనితో సామాన్యులు వంట చేసుకొని తినే పరిస్థితి కనబడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.

వంట నూనెల తయారీ, విక్రయ సంస్థలు తమ ఉత్పత్తుల గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను తగ్గించాయి. నూనె ప్యాకెట్లపై ముద్రించి ఉండే ధరతో పోలిస్తే, దుకాణాల్లో తక్కువకే విక్రయిస్తుంటారు. రైతుబజార్లతో పాటు దిగ్గజ సూపర్‌ మార్కెట్లు, బ్రాండెడ్‌ అవుట్‌లెట్లలో ధరలను పరిశీలించి, కొనుగోలు చేసుకుంటే మేలు కలుగుతుంది.

ఫార్చూన్‌ బ్రాండ్‌పై ఉత్పత్తులు విక్రయించే అదానీ విల్మర్‌.. గరిష్ఠ విక్రయ ధరను లీటరుకు రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన సంస్థలు కూడా ఇలానే ఎంఆర్‌పీలను సవరించాయి.

రెండు నెలల క్రితం లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ గరిష్ఠ విక్రయ ధర రూ.220 కాగా, ఇప్పుడు రూ.192కు చేరిందని సంస్థ తెలిపింది.

రెండు మూడు నెలల్లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముందటి స్థాయికి (రూ.145-150) దిగి రావచ్చన్నారు.