చిన్నపిల్లలు ఆడుకునే గచ్చకాయలు(Gachakaya) ఆరోగ్యానికి ఎంతో ఔషదంగా పనిచేస్తాయి. పురాతన ఆయుర్వేద వైద్యంలో గచ్చికాయ చెట్టు ప్రతి భాగాన్ని ఉపయోగించేవారట. అనేక వ్యాధులను నయం చేసే ఔషద గుణాలు ఇందులో ఉన్నాయట. ఫెబాసియా కుటుంబానికి చెందిన ఈ మొక్కల శాస్త్రీయ నామం గిలాండినా బాండుక్. ముఖ్యంగా ఈ మొక్క ఆకులను ఆముదంలో వేయించి వృషణాలకు రాస్తే రెండు మూడు రోజుల్లోనే మగవారిలో ఉన్న వరిబీజం తగ్గిపోతుందట. అలాగే దంత సమస్యలు, పంటి సమస్యలకు దీని కాండం బాగా ఉపయోగపడుతుందట.
గచ్చకాయ(Gachakaya) గింజల గుజ్జును నెయ్యితో నూరి పొట్టపై రాసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఇక చ్చకాయలు పువ్వులను నమిలి రసం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందట. గింజలను నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తాగితే 15 రోజుల్లో షుగర్ అదుపులోకి వస్తుంది. అయితే అదుపులోకి వచ్చిన తర్వాత ఈ గింజలను మానివేయాలి. చిటికెడు గచ్చకాయ పొడి, ఐదు మిరియాల పొడి కలిపి తీసుకుంటే మహిళలకు రుతుక్రమం సక్రమంగా వస్తుందట. ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ చెట్టులో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గమనిక: గచ్చకాయ చెట్టును వాడే ముందు సంబంధింత నిపుణులను సంప్రదించి వాడాలని కోరుతున్నాం.