ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

-

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు తొమ్మిదిరకాల చిరుధాన్యాలను పండిస్తున్నారు. అందుకే వాటిని నవరత్నాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ చిరుధాన్యాల గొప్పతనం గురించి తెలుసుకుందాం.

- Advertisement -
  1. కొర్రలు (ఫాక్స్ టెయిల్): కొర్రల్లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. స్థూలకాయం, కీళ్లనొప్పులు, పార్కిన్సన్స్, మూర్చ, గుండె సంబంధిత వ్యాధులను నివారించే గుణం ఉంది.
  1. సామలు (లిటిల్ మిల్లెట్): సామల్లో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పీసీఓడీ, గర్భధారణ సమస్యలకు ఇదొక విరుగుడుగా చెబుతుంటారు.
  1. అరికలు (కొడొ మిల్లెట్): అరికలు మధుమేహ వ్యాధి నివారణకు దోహదం చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఇవి ఆహారంలో తీసుకుంటే రక్తహీనత అరికడుతుంది.
  1. ఊదలు/ కొడిసామ (బేరేయార్డ్ మిల్లెట్): ఊదలు గ్లూటిన్ రహితం కావడంతో కొలెస్ట్రాల్ నిరోధించబడుతుంది. లివర్, మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉంటాయి. దీనితో ఇడ్లీ, ఉప్మా, దోసె తరహాలో వంటకాలు చేయవచ్చు.

5. రాగిచోది (ఫింగర్ మిల్లెట్): రాగిచోది ప్రధానంగా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే        రక్తహీనత రాకుండా నివారించగలదు. రాగి రొట్టె, రాగి జావలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో                  సర్వసాధారణంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.

  1. సజ్జలు (పెర్ల్ మిల్లెట్): శరీరంలోని విషాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడం వీటి ప్రత్యేకత. టైప్ 2 మధుమేహానికి, గాలెన్స్ కి కూడా సజ్జలు విరుగుడు మార్గం. సజ్జరొట్టె, సజ్జ అంబలిని తెలుగు ప్రాంతాలలో విరివిగా తయారు చేస్తారు.
  1. అందు కొర్రలు (బ్రౌన్ టాప్ మిల్లెట్): వీటిలోను విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. థైరాయిడ్, కీళ్లనొప్పులు, స్థూలకాయం, రక్తపోటు రాకుండా నివారించగలవు.
  1. వరిగ (ప్రోసో మిల్లెట్/ కామన్ మిల్లెట్): వరిగ లో ఫాలిక్ యాసిడ్, విటమిన్లు ఉంటాయి. కార్టినాయిడ్స్, పాలిఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. అందుకే కొలస్ట్రాల్ ను అదుపు చేయడంలోను, రోగ నిరోధక శక్తికి తోడ్పడడంలోను వరిగ కి ప్రాధాన్యం ఉంది.
  1. జొన్నలు (గ్రేట్ మిల్లెట్/సార్గుమ్): ఇది చెడు కొలస్ట్రాల్ ను నివారిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జొన్నరొట్టె, జొన్న అంబలి విరివిగా తీసుకుంటారు.
Read Also: వేసవిలో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...