గుండెపోటు(Heart Attack).. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. స్కూల్ పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ హార్ట్ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందుతున్నారు. దీంతో హెల్త్ నిపుణులు అప్రమత్తమై ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. గుండెపోటు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అంటున్నారు. దానికోసం యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అంతేగాక, బాడీలోని చెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని.. అలాగనీ మితిమీరిన జిమ్‌లు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేస్తే హార్ట్స్ట్రోక్ రిస్క్ తగ్గించేనట్లే అని, దీంతోపాటు జీవన విధానంలోనూ మార్పులు రావాలని అంటున్నారు. ఆల్కహాల్, స్మోకింగ్, డగ్స్, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Read Also: పరగడుపునే తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే అద్భుత ప్రయోజనాలు
Follow us on: Google News