ఉడకపెట్టిన గుడ్డును ఎంత సమయంలో తినాలి – వైద్యులు ఏమంటున్నారు

How long to eat a boiled egg

0
111

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది. ఇక చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బలమైన ఫుడ్ తింటున్నారు. ముఖ్యంగా ప్రోటిన్ ఉండే వాటిని తీసుకోవాలనే దృష్టితో అందరూ కోడి గుడ్డును తీసుకుంటున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో గుడ్లు తీసుకుంటున్నారు. ఇక ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం శరీరానికి మంచిదని ఉదయం ఈ గుడ్డు తీసుకుంటున్నారు.

ఇక వైద్యులు కూడా పిల్లలు పెద్దలు రోజూ ఓ గుడ్డు తినవచ్చు అని చెబుతారు. అలాగే చేస్తున్నారు అందరూ.
ఉడికించిన గుడ్డు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.మీరు ఉడికించిన గుడ్లను ఎంతసేపు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నూనెలో ఫ్రై చేసిన దానిలో కంటే ఉడకబెట్టిన దానిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పులుసు కూరల్లో ఉడకబెట్టిన గుడ్లు తీసుకోండి.

గుడ్లులో, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్లు ఎ, బి 6, బి 12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, భాస్వరం , సెలీనియంలో లభిస్తాయి.
ఉడికించిన గుడ్లను 24 గంటలు కొందరు ఉంచుతారు. అయితే 12 గంటల కంటే ఎక్కువ సేపు ఉంచవద్దు అంటున్నారు వైద్యులు.
12 గంటల్లోపు తినాలి.ఎక్కువ గుడ్లు నిల్ల ఉంచితే వాటి PH మారుతుంది. ఈ కారణంగా అవి వాసన వస్తాయి.