రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..అతిగా తింటే ప్రాణాలకే ప్రమాదం!

0
49

సాధారణంగా గుడ్లు తినడానికి ఇష్టపడేవారు మనలో చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువ గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

అతిసారం:

అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది..అనే సామెత మీరు వినే ఉంటారు. గుడ్లు కూడా అంతే.. గుడ్లు మితంగా తినడం మంచిది. ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అధిక విరేచనాలతో శరీరం బలహీనంగా మారిపోయి.. అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.

మలబద్ధకం..

ఎక్కువ గుడ్లు తినడం మన జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు చికాకు, గ్యాస్ సమస్యల ప్రమాదం కూడా ఉండవచ్చు.

బరువు పెరుగుదల..

గుడ్డులో కొవ్వు ఉంటుంది. మీరు ఎక్కువ గుడ్లు తిన్నప్పుడు మీ శరీరం వినియోగించే కేలరీలను సమతుల్యం చేయదు. దీని కారణంగా మీరు బరువు పెరగడం ప్రారంభిస్తారు. మీరు ఎక్కువ గుడ్లు తీసుకుంటే అది నేరుగా మీ బరువును ప్రభావితం చేస్తుంది.

మధుమేహం వచ్చే ప్రమాదం

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని ముందే చెప్పుకున్నాం.. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు,..మన శరీరంలో చక్కెర పరిమాణం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే.. ఆ వ్యక్తి మధుమేహంతో బాధపడాల్సి వస్తుంది.