మొలకెత్తిన పెసలను తినడం వల్ల లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

0
104

ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటారు. అందుకే మీ ఆరోగ్యం ఇంకా మరింత మెరుగుపడాలంటే ఇలా చేయండి. మనందరికీ అందుబాటులో ఉండే పెసల్లతో ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అది ఎలాగంటే.. పెసలను నీటిలో నానబెట్టి ఆ తరువాత వాటిని మొలకెత్తించి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి.

అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడేవారు రోజు మొలకెత్తిన పెసలను తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవి తినడం వల్ల క్యాన్సర్ కూడా రాదని వైద్యులు వెల్లడిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మొలకలు పెరుగుదలకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

అంతేకాకుండా నానబెట్టిన పెసల్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. అందుకే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఇవి తినడం వల్ల ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా మీ దరి చేరకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వెంట్రుకలు పెరిగేలా చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.