ఇండియా కరోనా అప్డేట్..హెల్త్ బులిటెన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
41

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

ఫ్రాన్స్ లో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో కరోనా కొత్త కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 459 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 4172 గా ఉన్నాయి. ఇక మరణాల విషయానికొస్తే  గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎవరూ మృతిచెందలేదు.

మొత్తం కరోనా కేసులు: 7,99,991

యాక్టివ్​ కేసులు: 4,172

కోలుకున్నవారి సంఖ్య:  7,91,708