Amnesia: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!

-

Amnesia వల్ల కుక్కర్‌ విజిల్‌ ఇక్కడే పెట్టానే.. అయ్యో కారు కీస్‌ ఎక్కడ పెట్టానో గుర్తు లేదు అని ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా వెతికేయటం.. ఇంటి నుంచి బయటకు వెళ్లాక పాలు స్టవ్‌ మీదే వదిలేశానా.. ఫ్రిజ్‌లో పెట్టానా.. గ్యాస్‌ అసలు ఆపానో లేదో అని.. లేకపోతే అయ్యో పర్సు మరిచిపోయాను.. వాచ్‌ పెట్టుకోలేదు.. ఇంటి నుంచి ఫలానా పేపర్లు తీసుకువెళ్లాలనుకొని మరిచిపోయాను.. అంటూ ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? అందువల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవటం కోసం మందులను వాడటతున్నారా? కానీ అవి ఆరోగ్యంపై దుష్ఫలితాలు చూపవచ్చు. కేవలం మనం తీసుకునే ఆహారంతో మతిమరుపును తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచే మార్గాలను తెలుసుకుందాం రండి.

- Advertisement -

బాదంను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. బాదంలో పుష్కలంగా ఉంటాయి. vitamin B6, vitamin E, ఫైబర్‌ ప్రొటీన్లు బాదంలో అధికంగా ఉంటాయి. వీటివల్ల మెదడు పనితీరు బాగుటుంది. వాల్‌నట్స్‌ బ్రెయిన్‌కు సూపర్‌ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌గా పిలిచే వాల్‌ నట్స్‌లో ఒమెగా 3 యాసిడ్‌ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి అద్భుత ఔషధంగా పని చేస్తుంది. మతిమరుపును (Amnesia) తరిమికొట్టే మరొక మంచి ఆహారం అవిసె గింజలు, గుమ్మడి గింజలు. వీటిల్లో K,A, C, B6, ఐరన్‌, జింక్‌ వంటి విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. వీటిని రోజూ తినటం ద్వారా క్రమంగా జ్ఞాపకశక్తి పెరుగతుందని వైద్యులు వెల్లడించారు.

Read also: ఆ కోరికలు ఎక్కువయ్యాయా.. ప్రమాదంలో పడినట్లే..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...