టెన్షన్ పెట్టిస్తున్న మంకీఫాక్స్..కేంద్రం అలర్ట్..రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందాలు

0
38

ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ టెర్రర్ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో ఇంతవరకు కేరళలో 3, దిల్లీలో 1 కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.  దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

దేశంలో మంకీపాక్స్‌ వ్యాధి కట్టడికి గాను టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుందని తెలిపాయి. ఈ మేరకు కేసుల నిర్ధారణ, చికిత్సలు అందించడం, ఇతర కట్టడి చర్యలకు సంబంధించి కార్యాచరణకు గాను జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌లకు నిర్దేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు మంకీపాక్స్‌ను WHO అత్యవసర పరిస్థితిగా ఇప్పటికే ​ఓ ప్రకటించింది. అంతకుముందే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంకీపాక్స్‌ నిర్ధారణ పరీక్షలకు గాను ఐసీఎంఆర్‌ పరిధిలో 15 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది.