టీ20 సమరానికి వేళాయె..విండీస్ తో భారత్ ఢీ

0
37

రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమై గెలిచింది ధావన్ సేన. వెస్టిండీస్‌తో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో చాలా కాలం తర్వాత మళ్లీ ధావన్‌, శ్రేయస్‌, గిల్ ఫామ్‌ అందుకున్నారు. ఇప్పుడు టీ20 సిరీస్ కు టీమిండియా రెడీ అవుతుంది.

వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తిరిగి ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు అందుకుంటున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌, జడేజా ఈ సిరీస్‌లో ఆడేది అనుమానమే. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన వాళ్లలో సూర్యకుమార్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, అవేష్‌ ఖాన్, అక్షర్‌ పటేల్‌ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు.

టీ20 లీగ్స్‌ అంటేనే పెట్టింది పేరు విండీస్‌.  కెప్టెన్‌ పూరన్, ఆల్‌రౌండర్‌ హోల్డర్, పేసర్‌ అల్జారి జోసెఫ్‌లతో పాటు విధ్వంసక రోమన్‌ పావెల్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగలరు. హోల్డర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ గురించి తెలిసిందే. వీరు కాక ఆల్‌రౌండర్‌ కైల్‌ మేయర్స్, ఓపెనర్‌ కింగ్, స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌లతోనూ భారత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే.

 

వీరికి తోడు మిగతా ఆటగాళ్లు రాణిస్తే విజయం ఖాయం. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్‌, మోటీ ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో మేయర్స్‌, బ్రూక్స్‌, కింగ్‌ రాణించారు. వీళ్లతో పాటు కెప్టెన్‌ పూరన్‌, హోప్‌ క్రీజులో నిలబడాలని జట్టు కోరుకుంటోంది.