అప్పడాలతో ఇంత ఆరోగ్యమా..

-

Papad Health Benefits | పూర్తిస్థాయి భారతదేశ భోజనం అంటే అప్పడం లేకుండా అస్సలు పూర్తి కాదు. అప్పడాలు అంటే అదో చిరుతిండిలానే చాలా మంది అనుకుంటారు. ఏదో ఆహారంలో నంచుకోవడానికి అప్పడాలు తింటారనే, వీటి వల్ల పెద్దగా ఉపయోగాలేమీ ఉండవని, కరకరలాడుతూ ఓ ముద్ద ఎక్కువ అహారం తీసుకోవడాని ఒక సహాయపడతాయని అందరూ అనుకుంటారు. కానీ అప్పడాలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ అప్పడాలు తొలుత భారత్‌లో మాత్రమే ఉండేవని, కానీ భారత్‌కు బ్రిటిష్ వాళ్లు వచ్చిన తర్వాతే ఇవి ప్రపంచానికి పరిచయం అయ్యాయని చాలా మంది చెప్తుంటారు. ఏది ఏమైనా అప్పడాలతో కూడా పసందైన ఆరోగ్యం మనకు దక్కుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అప్పడాలు కూడా ఔషదగుణాలను కలిగి ఉంటాయని, వాటిలో ఉండే ప్రతి పదార్థం మన ఆరోగ్యానికి దోహపడతాయని చెప్తున్నారు. వీటిలో ఉండే ఫైబర్, ప్రొటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనేది నిపుణులు చెప్తున్న మాట. మన జీర్ణ ప్రక్రియను మెరుగు పరచడంలో, ఎసిడిటీని తగ్గించడంలో కూడా అప్పడాలు అద్భుతంగా పనిచేస్తాయట.

- Advertisement -

అప్పడాల్లో అధికంగా ఉండే ఫైబర్.. మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్యను అధికం చేస్తుంది. దీని వల్ల ఆహారం త్వరగా జిర్ణమై.. శరీరానికి శక్తిని త్వరగా అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అప్పడాలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా వీటిలో కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పోటాషియం, ఐరన్ వంటివాటిని అధికంగా శరీరానికి అందిస్తాయి. తద్వారా అనేక విధాలుగా శరీరానికి అప్పడాలు మేలు చేస్తాయని చెప్తున్నారు.

అధిక బరువుకు అద్భుతం: అప్పడాల్లో క్యాలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గాలని అనుకునే వారు అప్పడాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువును అదుపు చేసుకోగలమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్.. మనకు వెంటనే ఆకలి కాకుండా చేసి.. ఆహారం ఇన్‌టేక్‌ను తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలెర్టీలు ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల ఏమీ కాదని అంటున్నారు నిపుణులు. అన్ని వయసుల వారు, షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా అప్పడాలు లాగించేయొచ్చని నిపుణులు అంటున్నారు.

చర్మ ఆరోగ్యానికీ అప్పడమే: అప్పడాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయని, కంటి సంబంధిత రుగ్మతలకు కూడా అప్పడాలు అద్భుతంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు నిపుణులు. చెవి సంబంధి వ్యాధులకు కూడా పెసర అప్పడాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

జ్వరానికి సూపర్: జ్వరం వచ్చిన సమయంలో నోరంతా చేదుగా అనిపించడం, ఆకలి కాకపోవడం, ఏమీ తినాలని అనిపించకపోవడం అందరిలో కనిపించే లక్షణాలే. అలాంటి సమయంలో వేయించిన లేదా కాల్చిన పెసరపప్పు అప్పడాలను తినడం ఎంతో మేలు చేస్తాయట. అధిక జ్వరం ఉన్న సమయంలో ఆకలిని పెంచడమే కాకుండా, జ్వరాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం.. రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుందని అంటున్నారు. ఇలా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అప్పడాలతో(Papad Health Benefits) పొందొచ్చని చెప్తున్నారు ఆరోగ్య, ఆయుర్వేద, పోషకాహార నిపుణులు.

Read Also: ఆర్థరైటిస్‌కు అదిరిపోయే చిట్కా..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...