శానిటైజర్ వాడితే క్యాన్సర్ చర్మవ్యాధులు వస్తాయా? క్లారిటీ ఇచ్చిన సర్కార్

శానిటైజర్ వాడితే క్యాన్సర్ చర్మవ్యాధులు వస్తాయా? క్లారిటీ ఇచ్చిన సర్కార్

0
117

గతంలో శానిటైజర్ అంటే చాలా మందికి తెలియదు, కాని ఇప్పుడు మాత్రం వైరస్ లాక్ డౌన్ తో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు,ఇది ఎవరిపై ఎఫెక్ట్ చూపుతుందో అనే భయం కలుగుతోంది, అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఇటు వైరస్ విజృంభిస్తున్న సమయంలో మాస్క్ తో పాటు కచ్చితంగా శానిటైజర కూడా వాడుతున్నారు.

బయటకు వెళ్లొచ్చినా, ఏమైనా వస్తువులను తాకినా, ప్రయాణాలు చేసినా చేతులను వెంటనే శానిటైజర్తో శుభ్రం చేసుకుంటున్నారు. అయితే, శానిటైజర్ అతిగా వాడితే చర్మ వ్యాధుల ముప్పు ఉందని,
క్యాన్సర్ కూడా రావొచ్చని ఈ నాలుగు రోజులుగా తీవ్రమైన ప్రచారం జరుగుతోంది, అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది వైద్యులని అడిగితే విషయాలు చెప్పారు.

వరుసగా 50 నుంచి 60 రోజులు శానిటైజర్ వాడితే క్యాన్సర్, చర్మ వ్యాధులు వస్తాయని ఇలా వైరల్ అవుతున్న వార్త నిజం కాదు అంటున్నారు వైద్యులు. శానిటైజర్ వాడితే క్యాన్సర్ రాదు అని తెలిపారు,
70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా సోకదని, దీని వల్ల క్యాన్సర్ రాదు అని అదంతా ఫేక్ అని ప్రభుత్వం కూడా చెబుతోంది.