కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను తొలగించే సింపుల్ చిట్కాలివే?

0
88

ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రి పది దాటినా కూడా నిద్రపోకపోవడం వల్ల కళ్ళ చుట్టూ నల్లటి పడుతుంటారు. వీటిని తొలగించుకోవడానికి వివిధ రకాల చిట్కాలతో పాటు మార్కెట్లో ఆంటీ మెంట్స్ వాడడం వల్ల కళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కావున ఈ సహజమైన చిట్కాలను పాటించి నల్లటి వలయాలను తొలగించుకొండి..

కళ్ళ చుట్టూ నల్లటి వలయాల కారణంగా చూడడానికి అందవిహీనంగా కనిపిస్తారు. అందుకే వీటిని తొలగించుకోవాలంటే ముందుగా తులసి ఆకుల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకొని తగిన మోతాదులో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తరువాత కొంతసమయం ఉంచుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

ఇలా రోజు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, సౌందర్యవంతంగా కనిపించడంతో పాటు నల్లటి వలయాలు తొలగిపోతాయి. రెండు టీ స్పూన్ల శెనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి మిశ్రమంగా తయారు చేసుకొని మెడ నుంచి ముఖం వరకూ పాటించాలి. అనంతరం ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా నల్లటి వలయాలు తొలగిపోతాయి.