బల్లులను త్వరగా ఇంట్లో నుంచి తరిమికొట్టే సింపుల్ చిట్కాలివే?

0
46

సాధారణంగా అందరి ఇళ్లల్లో బల్లులు ఉండడంలో పెద్ద ఆశర్యమేమి లేదు. కానీ వీటిని చూడడానికి చాలామంది ఇష్టపడకపోవడమే కాకుండా..వీటిని ఇంట్లో నుండి బయటకు తరిమికొట్టడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే మందులను, ఇంట్లో సహజసిద్దమైన చిట్కాలను పాటిస్తూ తరిమికొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.

కానీ ఆశించిన మేరకు ఫలితాలు లభించకపోగా..ఆ మందులను ఇంట్లో చల్లడం వల్ల వివిధ ప్రాణాంతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున ఈ సింపుల్ చిట్కాలను పాటించి బల్లులని ఇంట్లో నుంచి తరిమికొట్టండి. ముఖ్యంగా బల్లులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.

అంతేకాకుండా బల్లి వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండేందుకు అధికంగా ఇష్టపడుతుంది. కావున మీరు  స్ప్రే బాటిల్ తీసుకోని, అందులో ఐస్ కూబ్స్ వేసి, అవి ఇలా కరుగుతుండగానే నీటిని బల్లులపై స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పిల్లిని చూస్తే బల్లి భయపడుతుంది. కావున పిల్లిని పెంచుకోవడం మంచిది. పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవు.