నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి

0
89

ఈమధ్య కాలంలో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యకు గల ముఖ్య కారణం ఏంటంటే..ఒకే చోట కూర్చుని పనులు చేయడం వల్ల వెన్నెముక మీద భారం పడి వెన్నునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పుల కారణంగా తినే తిండి , పానీయాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇలా వెన్ను నొప్పితో బాధపడాల్సి ఉంటుంది.

ఈ సమస్యను దూరం చేసుకోవడానికి అనేక రకాల చిట్కాలు పాటించడంతో పాటు మందులు వాడుతుంటారు. వారితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. దృఢమైన జీవనశైలిని అనుసరిస్తే నడుము నొప్పి తగ్గడంతో పాటు ఎటువంటి సమస్యలు మిమ్మల్ని దరిచేరవు. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది.

అంతేకాకుండా ఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా కాఫీలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల అది మీ ఎముకలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి వాటికి అలవాటు పడితే కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాబట్టి కెఫిన్ ను దూరంగా వుండి పాల ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.