తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా : బులిటెన్ రిలీజ్, జిల్లాల లిస్ట్ ఇదే

0
35

తెలంగాణలో ఆదివారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం కేసులు వెయ్యి లోపుకు చేరుకున్నాయి. నిన్నమొన్న వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న వేళ ఇవాళ కేవలం 748 కేసులు మాత్రమే నమోదు కావడం తెలంగాణ ప్రజానీకానికి గొప్ప ఊరటగా చెప్పవచ్చు. ఇక ఆరు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కాగా మూడు జిల్లాలో సున్నా కేసులు నమోదయ్యాయి. ఇక జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు అయ్యాయి.

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య శనివారం 1028 తో పోలిస్తే ఆదివారం 748 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక శుక్రవారం నమోదైన కేసులు 1061 కాగా, గురువారం నమోదైన 1088 కేసులు, బుధవారం నమోదైన 1114 కేసులు, మంగళవారం కేసులు 1175 కంటే ఇవాళ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనబడుతున్నది.

ఇవాళ మరణాల సంఖ్య 8 గా నమోదైంది. శనివారం 9 మరణాలు,  శుక్రవారం 11 మరణాలు చోటు చేసుకోగా, గురువారం మరణాల సంఖ్య 9 కాగా, బుధవారం 12 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 10 ఉంది.  మరణాల సంఖ్య గడిచిన వారం రోజులుగా పదికి అటూ ఇటుగా నమోదవుతున్నది.  నిన్న, ఇవాళ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 121 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. జీరో కేసులు నమోదైన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు చూస్తే… జనగామ 6 కేసులు, జోగులాంబ గద్వాల 6 కేసులు, మెదక్ లో 4 కేసులు, నారాయణపేటలో 6 కేసులు, నిర్మల్ లో 1 కేసు, నిజామాబాద్ లో 7కేసులు, వికారాబాద్ లో 8 కేసులు నమోదయ్యాయి.

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 81405 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1492 గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 14302 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1077.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.

ఆదిలాబాద్ 0

కొత్తగూడెం  42

జిహెచ్ఎంసి  121

జగిత్యాల  19

జనగామ 6

జయశంకర్ భూపాలపల్లి 18

జోగులాంబ గద్వాల  6

కామారెడ్డి  0

కరీంనగర్  50

ఖమ్మం  61

కొమరం భీం ఆసిఫాబాద్ 0

మహబూబ్ నగర్  16

మహబూబాబాద్  29

మంచిర్యాల  25

మెదక్  4

మేడ్చల్ మల్కాజ్ గిరి 36

ములుగు  14

నాగర్ కర్నూల్ 10

నల్లగొండ  34

నారాయణపేట 6

నిర్మల్  1

నిజామాబాద్ 7

పెద్లపల్లి   21

రాజన్న సిరిసిల్ల 15

రంగారెడ్డి  49

సంగారెడ్డి  24

సిద్దిపేట  22

సూర్యాపేట  44

వికారాబాద్  08

వనపర్తి  13

వరంగల్ రూరల్ 10

వరంగల్ అర్బన్  25

యాదాద్రి భువనగిరి 12