రక్తదానం చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..

0
41

రక్త దానం చేయడం అంటే వారికీ పునర్జన్మను ఇచ్చినట్టే. కానీ మనలో చాలామందికి రక్తదానం చేయడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అపోహ పడుతుంటాం. కానీ రక్తదానం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు 33 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్యయానాలలో వెల్లడయింది. క‌నుక ర‌క్త‌దానం చేయడానికి మీరు కూడా ప్రయత్నిస్తే గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండడానికీ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొత్త ర‌క్త క‌ణాలు తయారయ్యి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ర‌క్త‌దానం వ‌ల్ల లివ‌ర్, పేగులు, ఊపిరితిత్తులు, గొంతు భాగాల‌కు చెందిన క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.