రైతులకు శుభవార్త..నేడు ఖాతాల్లో డబ్బులు జమ

0
39

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమాకు శ్రీ‌కారం చుట్టి రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

రైతులు చెమటోడ్చి కష్టపడినందుకు ఫలితం దక్కేలా వైసీపీ ప్ర‌భుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే ఖ‌రీఫ్ సీజ‌న్ ప్రారంభానికి ముందే రైతుల‌కు పెట్టుబ‌డి సాయం పేరిట రైతు భ‌రోసా, అలాగే యంత్ర సాయం అంటూ ఇలా రకరకాల పథకాలను అమలు చేసి రైతులను ఆదుకుంటున్న పభుత్వం తాజాగా రైతు భ‌రోసాతో పాటు పంటల బీమా అందించేందుకు సన్నాహాలు చేస్తూ మరోసారి రైతులను ఖుషి చేసారు.

వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా పేరిట అమ‌ల‌య్యే ఈ ప‌థ‌కం కింద ఇవాళ రైతుల ఖాతాల్లోకి 2,977 కోట్ల రూపాయ‌లు జ‌మ కానున్నాయి. ఈ ప‌థ‌కం ద్వారా 15.61 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరనున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తుంది. శ్రీ స‌త్య‌సాయి జిల్లా, చెన్నేకొత్త‌ప‌ల్లి లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులు జ‌మ చేయ‌నున్నారు.