ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే ప్రస్తుతం బూడిద గుమ్మడికాయ తినడం వల్ల లాభాలు తెలియనివారు చాలామందే ఉన్నారు. కానీ ఒక్కసారి వాటివల్ల లాభాలు తెలిస్తే మళ్ళి జీవితంలో దీనిని విడిచిపెట్టారు.
బూడిద గుమ్మడి కాయలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయలతో కూరలను, పప్పును, తీపి పదార్థాలను చేసుకొని తినడం వల్ల రుచితో పాటు..ఆరోగ్యానికి కూడా అమితమైన మేలు చేస్తుంది. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా బూడిద గుమ్మడి కాయ బరువు తగ్గాలనుకునేవారికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వారానికి రెండుసార్లు దీనిని తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. గుమ్మడి కాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.