వేసవిలో రోజూతాగే నీటి కంటే అధికంగా తాగాలి , అధిక సూర్యతాపం వల్ల నీరు కచ్చితంగా తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కొందరు రోజుకి మహా అయితే లీటరు నీరు తీసుకుంటారు దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి ముఖ్యంగా మల బద్దకం వస్తుంది, మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండనివ్వాలి.
డీ హైడ్రేడ్ సమస్య లేకుండా ఉండాలి అంటే తగినన్నీ నీరు తాగాలి.అయితే కచ్చితంగా రోజుకి 5 లీటర్ల నీరు తాగితే దాదాపు 50 శాతం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే నీరు తాగకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చూద్దాం.
నీళ్లు తాగని వారి ముఖంలో మొటిమలు గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇక జిడ్డు సమస్యలు కూడా ఉంటాయి. ఇక ముఖం కాంతివంతంగా కనిపించదు. కళ్ల కింద ముడతలు వస్తాయి. వాటర్ తాగకపోతే చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది. ముఖ్యంగా నీరసం అలసట అనేది బాధిస్తాయి. ఏదైనా తినే అరగంట ముందు నీరు తాగితే మంచిది, తింటూ ఉన్న సమయంలో నీరు తాగవద్దు అంటున్నారు వైద్యులు.